ప్రార్థన:
భయంకరమైన పరిస్థితులలో మాకు ఉపదేశము చేసి మేము
నడువవలసిన త్రోవను నడిపించుము.
యెషయా -48:17
"మహోన్నతుడా సర్వ
సృష్టికర్త రాజులకు రాజా పరమ పవిత్రుడా మీ పవిత్రమైన పాదాలకు వందనములు స్తుతులు
స్తోత్రములు తండ్రి.
దేవా భయంకరమైన
దినములలోమాకు ప్రార్ధించడం నేర్పుము తండ్రీ. దేవా ఆనాడు శిష్యులకు నేర్పిన
ప్రార్థన ద్వారా మేము నీ చిత్తమును ఎరిగి మీ మనసును ఎరిగి మీరు అంగీకరించు
ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయుము ప్రార్థన ద్వారా కలిగే రక్షణ, సమాధానము రాకడ కొరకు సిద్ధపాటు, విడుదల, స్వస్థత, సంపూర్ణ దీవెన,
ఆశీర్వాదములు
మేము ప్రతి ఒక్కరం అనుభవించునట్టుగా మాకు ప్రార్థన నేర్పుము తండ్రీ.దేవా ఈ
దినములలో నీ పాద సన్నిధిలో చేరి అడుగుతున్నాము నా నామములో అడగండి మీరు ఏది అడిగిన
నేను ఇస్తాను అన్న మీ మాటలను బట్టి
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగే యుద్ధం వెంటనే
ఆగిపోయి సమాధానము కలుగజేయుము తండ్రి అలాగే,
*ఈ మరణకరమైన దినముల
నుండి విడుదల పొంది నీ స్వారూప్యములో జీవిస్తూ మా అవసరతల కొరకు మాత్రమే కాకుండా
అనేక మంది రక్షణ కోరకు నిన్ను వేడుకొనుటకు మాకు సహాయం చేయుము తండ్రీ.
దేవా ఈరాత్రి ఎంత మంది మీ పాద సన్నిధిలోకి చేరి
వారి అవసరతలు గురించి వారి కరువులు గురించి వారి బాధలు గురించి వారి ఆనారోగ్యముల
గురించి వారు ఉన్న స్థితిలో మీకు మొఱ్ఱపెట్టు కొనుచుండగా తండ్రీ ఆకాశము నుండి నీవు
వారి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరచి నీ
అద్భుత కార్యములు వారి జీవితాల్లో చూచునట్లుగా మీ పరిశుధాత్మను ప్రతి ఒక్కరూపై
కుమ్మరించుము తండ్రీ.
దేవా ఈ కడవరి
దినములలో నీ మందిర ఆవరణములకు చేరలేని స్థితిలో ఉన్న నీ ప్రియ బిడ్డలు
అందరిని జ్ఞాపకం చేసుకొనుము ప్రతి ఒక్కరూ వారి కుటుంబముతో కలిసి నిన్ను
ఆరాధించుటకు ప్రతి కుటుంబానికి సహాయం చేయండి.
దేవా మరణకరమైన
దినములలో రేపటి పునరుద్ధరణ (ఆదివారం) ఉదయమునే లేచి నిన్ను స్తుతించి
ఆరాధించి మీ నామమును ఘనపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయుము తండ్రి,
ఆనాడు యోబు కుటుంబానికి మీరు వేసిన బలమైన కంచే
అనే కాపుదల ఈ రాత్రి ఉక్రెయిన్ రష్యా దేశములలో భయాందోళనలతో బ్రతుకులు గడుపుతున్న
వారికి
మా గృహముల చుట్టూ మా పడకలు చుట్టూ మీ దేవదూతల
రెక్కలు క్రింద కాచి కాపాడి రక్షించుము అని మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఈ నా చిన్న ప్రార్థన మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు
వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
0 Comments